కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైఎస్సార్సిపి లక్ష్యమా..? – దోమకొండ అశోక్

విజయవాడ, పాలన చేతకాక, మళ్లీ అధికారంలోకి రాలేము అనే భయంతో వైసిపి కులాల మధ్య చిచ్చు పెడుతుంది. మీరు కులాల మధ్య చిచ్చు పెడితే ప్రజలు మీ పార్టీని భూస్థాపితం చేస్తారు. వైసిపి మంత్రులకు వారి శాఖల మీద పట్టు లేకపోయినా కులాల మధ్య చిచ్చుపెట్టడంలో పట్టు ఉన్నట్లుంది. జనసేన పాలసీల గురించి మాట్లాడుతుంటే వైసిపి కులాల గురించి మాట్లాడుతుంది. జనసేన పార్టీ అన్ని కులాలను కలుపుకుంటూ వెళుతుంటే, వైసిపి అన్ని కులాల మధ్య అడ్డుగోడ కడుతూ వెళుతుంది. కులాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు వేయించుకున్న జగన్ రెడ్డి, అన్ని కులాల వారిని విస్మరించి కుల రాజకీయాలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నానని దోమకొండ అశోక్ అన్నారు.