వెల్లంపల్లిపై విరుచుకుపడ్డ జనసేన నాయకులు

విజయవాడ, పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ విజయవాడ అధికార ప్రతినిధి ముద్దాన శంకర్ రావు (స్టాలిన్ శంకర్) నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టిడ్కో ఇళ్ళ కోసం నగరంలో అనేకమంది మహిళలు అప్పులు చేసి పాతికవేల నుంచి లక్ష రూపాయల వరకు గత ప్రభుత్వంలో చెల్లిస్తే వారికి మీరు వచ్చి ఇల్లు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారని గతంలో జక్కంపూడిలో కట్టినటువంటి ఇల్లును ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో చెప్పాలని, ఆ ఇల్లు అన్ని మీ వైసీపీ కార్యకర్తలకు ఇవ్వాలనుకుంటున్నారా..?? అని ఇప్పటికే అవి శిథిలావస్థకు చేరుకున్నాయని దీనికి ఈ ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్సిపి అధికారంలోకి రాకముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి ఉన్నారని ఆ వాగ్దానాలన్నీ తీర్చనందుకు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని, అధికారంలోకి రాగానే కేంద్ర మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన మీ జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద మోకరిల్లి ఆంధ్రప్రదేశ్ పరువు తీసాడని. అలాగే అధికారంలోకి రాగానే మీ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామన్నారు. మద్యం నిషేధించకపోగా మీ జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్లతో మద్యాన్ని ఏరులై పారిచి సామాన్య మధ్యతరగతి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారని. సంపూర్ణ మద్యపానం నిషేధం అంటే ఇదేనా..?? అని మీరు అధికారంలో రాకముందు బాదుడే బాదుడని స్లోగంచి ఇచ్చిన మీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నిత్యావసర ధరలు అన్నింటిని పెంచి వీరబాదుడే బాదుడే స్లోగన్ ఎత్తుకునేలా చేశారని . పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఆపలేదని కొంచెం కాల వ్యవధి ప్రకటించారని, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ద్వారా మీలాంటి అవినీతిపరులు పరిగెత్తిస్తారని, రాబోయే రోజుల్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారని పశ్చిమ నియోజకవర్గంలో నీ అవినీతి బట్ట బయలు చేసి వేల్లంపల్లి శ్రీనివాస్ని మాజీని చేసిన ఘనత మా పోతిన మహేష్ ది అని పశ్చిమలో మహేష్ ఎదుగుదలను చూసి ఓర్వలేక పనికిమాలిన నలుగురు వ్యక్తులను కోవర్ట్ లు చేసి జనసేన పార్టీలో చీలకలు తేవాలని చూస్తున్నారని ఆ కోవర్ట్ లకు సరిగ్గా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ విలువలు గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉందని తన స్వలాభం కోసం పార్టీలు మారే నీలాంటి వ్యక్తి కూడా విలువలు గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని, గత మూడేళ్లలో ఎమ్మెల్యే ఉండి కూడా నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని మీకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అనంతరం నమన్ కార్తీక్ మాట్లాడుతూ మంత్రిగా మూడు సంవత్సరాలు చేసిన వెలంపల్లి శ్రీనివాస్ వాళ్ళ ఇంటిదగ్గర రోడ్డు వేయించుకోవడానికి నాలుగు రోజులు పట్టింది కానీ విజయవాడపశ్చిమ నియోజకవర్గంలో గుంటలు పడిన రోడ్లు పూడ్చి కొత్త రోడ్లు వేయలేకపోయారు కొండ ప్రాంతంలో మెట్లు పాడైపోతే నేటికీ కొత్త మెట్లు కట్టలేకపోయారని, పశ్చిమ నియోజకవర్గంలో యువతకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేకపోయారని మంత్రిగా మూడు మూడు సంవత్సరాల్లో ప్రజా సమస్యలను ఈనాడు పట్టించుకోలేదని కానీ విజయవాడ సిటీ అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిలిచారని, మీ రాజకీయ లబ్ధి కోసం 2009 నుంచి 2014 వరకు మీరు అనేక పార్టీలు మారారు మీరా విలువల గురించి మాట్లాడేది వేల్లంపల్లి శ్రీనివాస్… మీకు ఇదే చెప్తున్నా ఇంకొకసారి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి కానీ మా విజయవాడ అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ గురించి గానీ ఇంకొక్కసారి తప్పుగా మాట్లాడితే మిమ్మల్ని రోడ్డు మీద కూడా నడవనివ్వమని మీ ఇంటి ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో విజయవాడ నగర ఉపాధ్యక్షులు సోమనాథం, సంయుక్త కార్యదర్శి గనీ రాము, జనసేన నాయకులు బైపు రామకృష్ణ, ములకల హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.