పవన్ కళ్యాణ్ ని సీఎంని చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

పాలకొండ, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రియాశీలక సభ్యత్వం జనసైనికులు కోసం తీసుకొచ్చారని, ఎందుకంటే జనసేన పార్టీ జెండా మోస్తున్న ఏ ఒక్క జనసైనికులు అయినా ఎలాంటి ప్రమాదం వలన అయినా ఏమైనా జరిగితే నేను ఆ ఇంటికి అన్నగా కొడుకుగా ఉంటాను అనే భరోసా ఇవ్వడానికి ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఇప్పటి వరకు దాదాపుగా 93 మంది జనసైనికులు ఒకొక్కరికి 5 లక్షలు రూపాయిలు ఇవ్వడం జరిగిందని, ఇలాంటి గొప్ప ఆలోచన ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా తీసుకోలేదని, అలాంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా 2024 లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలి పవన్ కళ్యాణ్ ని సీఎంని చేసుకునే విధంగా ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉన్నది అని జనసేన జానీ చెప్పడం జరిగింది. అలానే ఇంకా పాలకొండలో ఎవరైనా క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలి అనుకునే వారు 8106548607 నెంబర్ కి వివ్వరాలు ఇవ్వాలిసిందిగా కోరుకుంటున్నానని తెలిపారు.