ఉన్న పాఠశాలలను మూసివేయడం సరైనది కాదు: వంపూరు గంగులయ్య

పాడేరు, చింతపల్లి, పాఠశాలల విలీనం అనేది తప్పడు నిర్ణయం. ఇప్పుడు కొత్త పాఠశాలలు నిర్మించిపోగా ఇంతకుముందు ఎన్నో ఆశలతో స్థాపించిన స్కూళ్లను ముసివేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా సిగ్గుచేటు అంటున్న జనసేన పార్టీ అరకు, పాడేరు పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతు “అధికారంలో ఉన్న ఈ జగన్ పాలనలో ఉన్న పాఠశాలను మూసివేయడమేనా లేదా జగనన్న పాలనలో విద్యా విప్లవం శూన్యం అవ్వడం ఖాయం. ఎందుకంటే 10 మంది కంటే తక్కువ మంది విద్యార్థులు స్కూల్స్ తీసేస్తారా? మీ విద్యా విధానం ఎంత బలహీనంగా ఉందో చెప్పొచ్చు. స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి తప్ప తీసేడం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ఎందుకు అలా చేస్తుందో అస్సలు అర్ధం కాని పరిస్థితి. స్కూల్ లలో విద్యార్థుల సంఖ్యను పెంచి ఆ స్కూల్ లను కాపాడే ప్రయత్నం ఎందుకు చెయ్యటం లేదు ఈ వైసీపీ ప్రభుత్వం? మా ఊరికి కొత్త స్కూల్ లను నిర్మిచండి మహాప్రభో! అని డిమాండ్ చేయాల్సిన ప్రజలను ఉన్న పాఠశాలను ముసివేయ్యద్దు జగన్ రెడ్డి అని వేడుకొనే స్థితికి గిరిజనులను తీసుకొనిరావడమేనా ఆధునిక జగనన్న విద్యా విప్లవం. ఇవేనా నూతన విద్యా సంస్కరణలు..? ఈ వైసీపీ ప్రభుత్వం ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడిచినట్లు చెయ్యడం చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి మీరు చట్టాలను ఎప్పుడు గౌరవించారు? వ్యవస్థలను కాపాడాలి. వ్యవస్థ పతనమే మీ ప్రధాన లక్ష్యంగా ఉండాలి గాని వ్యవస్థను పాడు చెయ్యడం సరికాదు గుర్తించుకోండి. ఉన్న పాఠశాలను తీసేడం, విద్యా విప్లవాన్ని రద్దు చెయ్యడం చాలా వరకు జగన్ పాలన శూన్యం. మంచి చదువు చదివించే విధంగా ఉండాలి. విద్యార్థుల చదువులో ముందడుగు వెయ్యించాలి, చదువు విషయంలో మెరుగుపరిచే తాపత్రయం అధికారంలో ఉన్న ప్రభుత్వంకు మనసు కలిగి ఉండాలి.