పార్టీ కోసం కష్టపడే సైనికుడు వేణుని కోల్పోవడం బాధాకరం: గాదె వెంకటేశ్వరరావు

గురజాల, జనసేన పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకి..జనసైనికుడికి పార్టీ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. గురజాల నియోజకవర్గం పల్లెగుంత గ్రామ జన సైనికుడు డికొండ వేణు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులు ఆర్పించి,కుటుంబాన్ని పరామర్శించారు. వేణు కుటుంబానికి పవన్ కళ్యాణ్, రాష్ట్ర పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే డికొండ వేణుని కొల్పవడం పార్టీ తీరని లోటని ఆయన స్థానాన్ని ఎవరు భర్తీచేయలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో గురజాల మండల అధ్యక్షుడు ఉప్పిడి నరసింహారావు, పిడుగురాళ్ల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, దాచేపల్లి అధ్యక్షుడు మందపాటి దుర్గారావు, మాచవరం అధ్యక్షుడు బొమ్మా శ్రీనివాసరావు, రాజుపాలెం అధ్యక్షుడు తోట నర్సయ్య, గురజాల చిరంజీవి యువత అధ్యక్షుడు ఎర్నాని రామకృష్ణ, బావన్నారాయణ తవిటి, మణికంఠ, బడిదెల శ్రీనివాసరావు, బయ్యవరపు రమేష్, బుక్కీశెట్టి శివ, మల్లెల రామంజి, సాయి, పూర్ణ, తమ్మిశెట్టి మహేశ్, అతిలేశ్ కార్యకర్తలు పాల్గొన్నారు.