తెలుగు సరిగ్గా మాట్లాడలేని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు

కదిరి నియోజకవర్గం: జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రభుత్వ అధికారిక సమావేశంలో మాట్లాడిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. సరిగ్గా తెలుగులో మాట్లాడలేని అసమార్థ ముఖ్యమంత్రివి మీరు, మా అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ముఖ్యమంత్రిగా మీరు చేయలేని పని మా అధినేత చేస్తూ ప్రజలు దీవెనలు పొందుతూ వారాహి యాత్ర దిగ్విజయంగా నిర్వహిస్తూ ప్రజాసమస్యలు ఎత్తి చూపుతూ ఉన్న సందర్భంగా, మీరు, మీ పార్టీకి సంబంధించి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మా అధ్యక్షులు లేవనేత్తిన అంశాలు గురించి మాట్లాడకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. మా అధినేతకు మూడు పెళ్లిళ్లు అంటూ మాట్లాడడం సరికాదని మీడియా ముఖంగా తెలియజేస్తున్నానంటూ మీ కుటుంబంలో ఎంతమంది రెండు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు అని ఆయన అధికార పార్టీ వైసీపీపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు మాని ప్రజలకు గత ఎన్నికల హామీలు సంపూర్ణ మద్యపానం నిషేధం, సి పి యస్ రద్దు, జనవరి ఒకటో తారీఖునే జాబ్ క్యాలెండరు, ఉచిత విద్యుత్, వంటి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఇవన్నీ పక్కన పెట్టి కేవలం వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని లేనిపక్షంలో 2024 ఎలక్షన్లో ప్రజలే తమకు బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు కుటలా లక్ష్మణ్, ఐటీ వింగ్ కోఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, గాండ్లపెంట అధ్యక్షులు రవీంద్రనాయక్, నల్లచెరువు అధ్యక్షులు సాకే రవికుమార్, మహబూబ్ భాష, అంజిబాబు, లోకేష్, గుంత ప్రతాప్, సోమశేఖర్, రాజశేఖర్, ఇర్ఫాన్, హరిబాబు, చంద్రశేఖర్, రాజు, ఉత్తప్ప, బాబా, గోపినాథ్, నాగరాజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.