రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ని నమ్మించి మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రిదే

*సమస్యలు పరిష్కరించడం చేతగాక పవన్ కళ్యాణ్ పై విమర్శలు
అనంతపురం: నగర అధ్యక్షులు బాబురావు , జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీ కృష్ణ మరియు జిల్లా కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించమని అడిగితే వైసీపీ నేతలకు ఎక్కడలేని కోపం వస్తుందని, తమ అసమర్థతను, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే పవన్ కళ్యాణ్ గారి పై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్థిక నేరాలతో జైల్లో ఉన్న జైలుపుత్రుడు, మనీ ల్యాండరింగ్ కేసులో సిబిఐ చుట్టూ తిరుగుతున్న సిబిఐ దత్తపుత్రుడు, (సిపిఎస్) సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగుల్ని నమ్మించి మోసం చేసిన నయవంచక పుత్రుడు, అమలుకాని హామీలతో ప్రజల్ని మోసం చేసిన మాయల మరాఠీ పుత్రుడు జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. మరోవైపు తమ శాఖలపై ఏమాత్రం పట్టు సాధించేలేని స్థితిలో మంత్రులు ఉన్నారని విమర్శించారు. ఏపిలో మా అధినేత చేసే మంచి పనులకు ప్రజల ఆదరణ పెరుగుతున్నందున ఓర్వలేకనే మా అధినేత పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న మంత్రులను హెచ్చరించారు. ఇకపై మా అధినేత పై వ్యక్తిగత దూషణలు చేస్తే తాట తీస్తామని.. మీకు చేతనైతే ప్రజలకు సాయం చెయ్యండి లేకపోతే మేము చేస్తున్న సాయనికి సహకరించండి అంతేకాని అనవసరమైన విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకొము తగిన బుద్దిచెప్పాల్సి వస్తుంది అని హెచ్చరించారు. సంచలనం సృష్టించిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి గ్యాంగ్ రేప్ సంఘటనలో రాష్ట్ర హోంమంత్రి డొల్లతనం బయటపడిందని, మరోవైపు వచ్చే నెలలో గడపగడపకు అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రారంభించే కార్యక్రమానికి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని.. చీపుర్లు సిద్ధం చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సార్థకం చేసుకోవాలని హితువు పలికారు. అలాగే జనసేనకు రోజురోజుకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు గ్రంథ దివాకర్, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి, నగర ప్రధాన కార్యదర్శులు మేదరి వెంకటేశులు, వెంకట్ నారాయణ, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్ పాల్గొనడం జరిగింది.