ఆవిర్భావదినోత్సవ సభను విజయవంతం చేయడం మనందరి బాధ్యత: దారం అనిత

మదనపల్లె, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాబోవు కాలంలో రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రక్రియ కోసం, రాష్ట్ర రాజకీయంలో తీసుకురావాల్సిన మార్పుకోసం, నల్లదొరలు నీచ రాజకీయాలకు చరమగీతం పాడడం కోసం, పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తును యువతకు అందించడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న తొమ్మిదవ జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవ సభను విజయవంతం చేయడం మనందరి బాధ్యతగా స్వీకరిస్తూ. గురువారం జరిగిన జిల్లా కమిటీ, మండల అధ్యక్షులు సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ క్రింది సూచనలను నాయకులకు తెలియజేశారు

  1. ప్రతి నియోజకవర్గంలో పత్రిక సమావేశం నిర్వహించి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి ప్రజలకు వివరిస్తూ, నాయకులను కార్యకర్తలను ఈ సమావేశానికి హాజరు అయ్యేలాగా పిలుపు నివ్వాలి.
  2. శుక్రవారం సాయంత్రంలోగా ప్రతి ఒక్క నియోజకవర్గంలోని ఈ సమావేశానికి వచ్చే కార్యకర్తల వివరాలను సేకరించాలి
  3. 13వ తేదీ మార్చి ఆదివారం మండల కేంద్రాలలో పట్టణాలలో జనసేన ఆవిర్భావ దినోత్సవ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలి. జిల్లా కమిటీ ఒక పోస్టర్ రేపటికి విడుదల చేస్తుంది.
  4. ప్రతి జన సైనికుడు తన బాధ్యతగా, సగర్వంగా, మన ఇంట్లో జరిగే ఒక పండుగలాగా ఆవిర్భావ సభకు హాజరవ్వాలని పిలుపునిచ్చారు
  5. ప్రతి నియోజకవర్గం నుండి ఆవిర్భావ సభకు వెళ్తున్నటువంటి నాయకులందరూ 14వ తేదీ సోమవారం ఉదయం 5 గంటలకు తిరుపతి అలిపిరి దగ్గర చేరుకోవాల్సినదిగా జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, మదనపల్లి, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల ఆవిర్భావం దినోత్సవం కార్యక్రమం పరిశీలకులు దారం అనిత కోరారు.