శ్రీమతి ఆరుద్రను పరామర్శించిన పంతం ననాజీ

కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం ప్రాంతానికి చెందిన శ్రీమతి ఆరుద్ర ఇటీవల తాడేపల్లిలోని సీఎంఓ కార్యాలయం వద్ద ఆమెకి న్యాయం జరగడం లేదని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్న ఆమె ఆసుపత్రి నుండి కాకినాడలోని ఆమె ఇంటికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్బంగా సోమవారం ఆరుద్ర భీమేశ్వరరావులను పరామర్శించి ఆమెతో మాట్లాడి వివరాలను తెలుసుకుని అధైర్య పడవద్దని, ప్రభుత్వం సాయం చేస్తామని చెప్పడం చాలా మంచి పరిణామం అని, జనసేన పార్టీ కూడా మీకు అండగా ఉంటుందని, మా అధినాయకత్వానికి కూడా మీ విషయం తెలియచేశామని జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.