సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే బాగుంటుంది: జంగాల శివరాం

మదనపల్లె, సీఎం సభ ఒక వారం ముందే రోడ్డ్డుకి ఇరువైపులా ఐరన్ బారికేడ్లు వేసి ప్రజలకి ఇబ్బంది పెట్టడం అవసరమా? బటన్ నొక్కడానికి మదనపల్లెకు ముఖ్యమంత్రి రావాలా..? ఈనెల 29 లేదా 30 వ తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదనపల్లె పర్యటనకు రాబోతున్నారని అన్నారు. ఈ పర్యటన ప్రజాసమస్యలు పరిష్కారానికి కాదని, కేవలం బటన్ నొక్కే కార్యక్రమం మాత్రమే అని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం అన్నారు. మదనపల్లి నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలు అనేకం ఉన్నాయని ముఖ్యమంత్రి ఈ సమస్యలు తీరిస్తే బాగుంటుందన్నారు. పట్టణంలో ఉన్న ప్రజా సమస్యల పైన అధికార పార్టీ ఏ రోజు కూడా స్పందించిన పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి స్పందించి కోట్ల రూపాయలతో నిర్మించిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరవ పనులను మరియు ఋఆర్.ఓ ప్లాంట్ వెంటనే పూర్తి చేసి త్రాగునీరు మదనపల్లె వాసులకు అందివ్వాలి. ఈ ప్రాంతంలో టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ధరలు లేని సమయంలో రైతులు, పండించిన టమోటో ప్రభుత్వం కిలో 10 రూపాయలకు కొనాలని, కోమిటి వారి చెరువు అక్రమాలను తొలగించి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, బహుదాకాలవ ఆక్రమణలు తొలిగించి వాటిపైన వంతెనలను నిర్మించాలని, మదనపల్లె పట్టణంలో అండర్ డ్రైనేజ్ సిస్టం తేవాలని, దేశంలోనే పేరుగాంచిన ఏఎంసి ఆస్తులను ఆస్పటల్ కాకుండా జగనన్న కాలనీలకు తీసుకోకుండా ఏఎంసీకే ఇవ్వాలి మరియు ఆరోగ్యవరం వెల్లూరు సీఎంసీ హాస్పిటల్ లాగా చెయ్యాలని, ట్రాఫిక్ సమస్య పరిష్కారం చెయ్యాలని, కదిరి రోడ్ నుండి బెంగళూరు రోడ్ కి బైపాస్ రోడ్ వెయ్యాలి. ఇలాంటి ఎన్నో సమస్యలు మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నాయని వీటి పరిష్కారానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కేవలం బటన్ నొక్కే కార్యక్రమమే అయితే ప్రజలకు ఒరిగేదేమీ లేదని, ఈ కార్యక్రమం తాడేపల్లి ప్యాలస్ లోనే ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. దీని కోసం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేయడం ఎందుకన్నారు.