బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

నరసాపురం నియోజకవర్గం: మొగల్తూరు మండలం, కేపీ పాలెం సౌత్ గ్రామం బెల్లపుకొండ వారి మెరక నుండి అల్లంవారి మెరక వరకు “జనంలోకి జనసేన” కార్యక్రమంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టి ప్రజలందరూ ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, వలవల నాని, కోటిపల్లి వెంకటేశ్వరరావు, కొల్లాటి గోపీకృష్ణ, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, వట్టిప్రోలు సతీష్, నిప్పులేటి తారకరామారావు, పులి భుజంగరావు, బెల్లంకొండ నాయుడు, లక్కు బాబీ, గంటా కృష్ణ, అందే దొరబాబు, అందే వెంకటలక్ష్మి, మల్లిపూడి సత్యనారాయణ, అల్లం మెహర్ బాబు, అందే పద్మాజీ రావు, అందే శివ, మల్లిపూడి బాలు మరియు నియోజకవర్గ జనసేన – టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.