హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ ఘన విజయం

హోరా హోరీగా జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. సమీ ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై గెలుపొందారు.

కౌంటింగ్‌ మొదలైనప్పటి నుంచి చివరి వరకూ ఈటల ఆధిక్యంలోనే కొనసాగారు. ఎనిమిదో రౌండ్‌, 11వ రౌండ్‌లో మాత్రం గెల్లు స్వల్ప ఆధిక్యం కనబర్చారు. ఈటల విజయం సాధించడంతో భాజపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. హుజూరాబాద్‌ ఫలితాన్ని ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.