నా తొలి సినిమా విడుద‌లై నేటికి 18 ఏళ్లు: అల్లు అర్జున్

టాలీవుడ్ అగ్ర‌హీరోల్లో ఒక‌రిగా వెలుగొందుతోన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన తొలి చిత్రం గంగోత్రి. ఈ సినిమా 18 ఏళ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజున విడుద‌లైంది. ఆ సినిమా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు 100వ సినిమా. హీరోగా త‌న తొలి సినిమా విడుద‌లై 18 ఏళ్లు గ‌డుస్తున్న సంద‌ర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. “నా తొలి సినిమా విడుద‌లై 18 ఏళ్లు అవుతుంది. నా 18 ఏళ్ల సినీ ప్ర‌యాణంలో తోడుగా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికీ నేను మ‌న స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను. ఇన్నేళ్లుగా మీరు నాకు తోడుగా నిలుస్తుండ‌డం నా అదృష్టం” అని బ‌న్నీ ట్వీట్ చేశాడు. ఆయ‌న‌కు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.