ఓటమి భయంతో మతితప్పి మాట్లాడుతున్న జగన్

  • రాష్ట్ర రాజకీయాలన్ని పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే తిరుగుతున్నాయి
  • మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి నియోజకవర్గం: జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో చిల్లపల్లి మాట్లాడుతూ శ్రీ పవన్ కల్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం లేకపోవడం వల్లే జగన్ చెత్తచెత్తగా మాట్లాడుతున్నారు. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం అంతా హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని ఎఫ్.ఓ.ఏ. అనే కంపెనీలో ఎందుకు ఉంది? ఆ కంపెనీ ఎవరిది? – ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా..?. వాలంటీర్లలో కొంతమంది మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు చేయడం, వేధింపులకు గురి చేయడం, వివాహితల కాపురాలు కూల్చడం నిజం కాదా? వీరి వేధింపులకు, అత్యాచారాలకు బాధ్యులు ఎవరు?. ప్రతి వ్యక్తి ఆధార్, బ్యాంక్ వివరాల నుంచి సోషల్ మీడియా అకౌంట్ వివరాలు, ఎవరు ఎక్కడికి, ఎప్పుడు ఏ పని మీద వెళ్తున్నారు.. వ్యక్తిగతకు విషయాల గురించి వాలంటరీ వ్యవస్థకు ఎందుకు?.. అవివాహిత మహిళలు, ఒంటరి మహిళలు యువతుల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు సేకరిస్తున్న మాట నిజం కాదా?.. మహిళలు, యువతుల వివరాలు ఏ ఉద్దేశంతో తీసుకొంటున్నారు. వాలంటీర్లకు ఐడి కార్డులు కూడా లేవు అనేది వాస్తవం కాదా?.. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతున్న సీరియస్ విషయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఆ విషయాన్ని మరుగునపెట్టేందుకే చెత్త మాటలు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత జీవితం గురించి అవాకులు చెవాకులు పేలుతున్న జగన్ గురించి మేము కూడా మాట్లాడగలం. తండ్రి చనిపోయినప్పుడు జగన్ ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాడు. కలకత్తాలో ఉన్న మాట వాస్తవమా కదా? అప్పుడు ఆయన ఎవరితో ఏ టైప్ మీటింగ్ లో ఉన్నాడు. బెంగళూరు ప్యాలెస్ లో చేసిన అరాచకాల చిట్టా అందరికీ తెలుసు. లో అక్కడి రాసలీల గురించి వైసీపీ మంత్రుల గంట అరగంట వ్యవహారాలు.. ఈ అరాచకాలు బయటకు వస్తాయనే ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో ఆ రాష్ట్ర కీలక కాంగ్రెస్ నాయకుడికి ఎన్నికల ఫండ్ పేరుతో ఎన్ని వందల కోట్లు పంపించారు. ఆ డబ్బులు తీసుకువెళ్ళే బాధ్యతను ఏ ఉన్నతాధికారికి అప్పగించారో త్వరలో బయటపెడతాం. మీ ఇళ్ళల్లో ఉన్నవారి అక్రమ సంబంధాలు, వాటి నేపథ్యంలో నేరాలు కూడా కడప జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన వ్యక్తి కూడా నీతులు చెబుతున్నాడు.. జగన్.. నీలాగే మేము కూడా దిగజారి నీచంగా మాట్లాడగలను. కానీ మాకు సంస్కారం ఉంది. అందుకే హద్దుల్లో ఉండి మాట్లాడుతున్నాం. వారాహి యాత్ర విజయవంతం కావడం వాలంటరీ వ్యవస్థలోని లోపాలను వాస్తవాలను ప్రజలకి తెలియజేయడంతో వైఎస్ఆర్సిపి కి ఓటమి భయం పట్టుకుంది. జాతీయ రాజకీయాలకు సంబంధించి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ప్రాధాన్యత చూసి వైఎస్ఆర్సిపి నాయకులు ఓటమి భయం పట్టుకుంది భవిష్యత్తు ఏంటో వారికి స్పష్టంగా తెలిసిపోయింది. ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ సమావేశం విజయవంతంగా ముగించుకొని ఆంధ్రప్రదేశ్ వచ్చిన తదుపరి వాలంటరీ వ్యవస్థ పై ఆరోపణలు చేశారని కేసు నమోదు చేయడం ప్రజల దృష్టిని పక్కదారి మళ్ళించడానికి అసలు అందులో విషయమే లేదు. 13 సిబిఐ మూడు ఈడి కేసులు ఉన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వగా లేనిది ప్రజల కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారిపై కుట్రతో ఒకటి అర కేసులు పెడితే పవన్ కళ్యాణ్ గారి చిటికిన వేలు మీద వెంట్రుక కూడా కదలదు. పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు వైఎస్ఆర్సిపి నాయకులు దమ్ముంటే సమాధానం చెప్పాలి. వాళ్ళ ఇంటర్వ్యూ వ్యవస్థకు అధిపతి ఎవరు సీఎం, ఎంపీ ఎమ్మెల్యే, కలెక్టర్ ఎవరు?. మరి ఇదే ప్రభుత్వం, గ్రామ వాలంటరీల తప్పు చేస్తే ఎలాంటి సెక్షన్లు పెడుతుందో పత్రిక ముఖంగా వెల్లడించాలి. మేము జనసేన నుంచి ప్రభుత్వాలని ఒకటే అడుగుతున్నాము. 90% వాలంటరీ వ్యవస్థ ప్రజా సమస్యలను గుర్తించి సమస్య తీరే విధానాని ప్రభుత్వానికి తెలియచేసి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తుంది అలాంటి వాలంటరీ వ్యవస్థకు మీరు ఇచ్చే గౌరవం ఎక్కడ?.. ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు ఎక్కడైనా మీటింగులు పెట్టి ప్రజల సమస్యలు చెబుతుంటే ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటున్న వాలంటరీలని మీరు కనీసం కూర్చోమని కుర్చీ కూడా ఇవ్వకుండా నిలబెట్టి వాళ్ళని ఓట్టి కాళ్ళ మీద నుంచోపెట్టి మాట్లాడుతారు ఇదేనా ప్రభుత్వం వాలంటరీకి ఇచ్చే గౌరవం అని జనసేన పార్టీ తరఫున చిల్లపల్లి ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె.ఎస్.ఆర్) తదితరులు పాల్గొన్నారు.