వ్యవస్టలను చిన్నాభిన్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం: రానున్న రోజుల్లో ప్రభుత్వ అధికారులు వాళ్లలో వాళ్లే కొట్టుకొనేటట్టు చేసి వ్యవస్టలను జగన్మోహన్ రెడ్డి చిన్నాభిన్నం చేస్తున్నారని విజయవాడ 42వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనూష పేర్కొన్నారు. గురువారం అనూష విలేకరులతో మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఉన్నతమైన చదువులు చదువుకుని మరెంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి మంచి ఉద్దేశంతో ఉద్యోగం చేయాలని అనుకుంటున్న ప్రభుత్వంలో ఉన్న ప్రతి అధికారిని తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు.. ఒక చిన్న కానిస్టేబుల్, టీచర్ గారి దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రెటరీ వరకు ప్రతి ఒక్కరి చేత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో అధికార మదంతో తప్పులు చేయిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు.. మీరు ఏమన్నా శాశ్వతంగా సీఎం కుర్చీలో కూర్చుని పోతారు అనుకుంటున్నారా..? రేపు మీ అధికారం పోయి మేము అధికారంలోకి వస్తే ఈ అధికారుల పరిస్థితి ఏమిటి మీ గురించి వీళ్ళందరూ ఇబ్బందులు పడాలా? మీలాంటి నిరంకుసత్వ పాలన ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో గాని, దేశంలో గాని ఎక్కడా చూడలేదు. మీరు గాని మీ పార్టీ నాయకులు గాని ప్రలోభాలు, ప్రచార ఆర్భాటాలు తప్ప మరేమి చేసింది లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అర్థమైంది. మీ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న వారిని శాంతియుతంగా నిరసన కూడా వ్యక్తం చేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు మీరు. టీచర్లు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్, అంగన్వాడీ టీచర్లు, ఆర్టీసీ ఎంప్లాయిస్ అన్ని ప్రభుత్వ వ్యవస్థలలో మీ మీద ఉన్న వ్యతిరేకత ప్రజలకు తెలియకుండా తెలియకుండా చేయాలన్న మీ నిరంకుశత్వానికి స్వస్తి పలకనున్న ప్రజలు మీ లాగానే గత ప్రభుత్వలు కూడా ఆలోచించి ఉంటే మీరు ఓదార్పు యాత్ర చేసే వాళ్ళ అని అడుగుతున్నా..? అదేవిధంగా ఇదే నెలలో రెండో తారీకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము గాని మా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లు పెడితే టౌన్ ప్లానింగ్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు పోలీసుల్ని అడ్డం పెట్టుకొని మూడు గంటల్లో బ్యానర్లు అన్నిటిని తొలగించారు. ఈరోజు మీకు బ్యానర్లు కనపడడం లేదా..?
లేకపోతే మీరు నిద్రపోతున్నారా..? మూడు రోజులు ముందు నుంచి బ్యానర్లు కడుతున్నారు.. లేకపోతే మీరే దగ్గరుండి కట్టిస్తున్నారా..? ఏ అధికార పార్టీకి ఒక న్యాయం ప్రతిపక్ష పార్టీకి మరొక న్యాయమా…? మీరు అధికారుల లేక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల.. మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి..? ఇంత దుర్మార్గపు పాలన చేస్తున్నజగన్మోహన్ రెడ్డి గారికి పశ్చిమ నియోజకవర్గం రావడానికి ఎటువంటి అర్హత లేదు.. మిమ్మల్ని జనసేన పార్టీ తరపు నుంచి తప్పకుండా అడ్డుకుంటామని అనూష పేర్కొన్నారు.