గిరిజన ప్రజలను నిండా ముంచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

  • శ్రీమతి కొత్తపల్లి గీత ఎన్డీఏ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి

పాడేరు: సోమవారం జరిగిన బారి రోడ్డు షో కొయ్యూరు మండలం కాకర పాడు నుంచి కొయ్యూరు మండల ప్రధాన కూడలి వరకు ఎన్డీఏ కూటమి కార్యకర్తల నినాదాలతో దద్దరిల్లింది. ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి గిడ్డి ఈశ్వరి, జనసేన పార్టీ ఇంచార్జ్ డా. గంగులయ్య, ఎం.వి.వి.స్ ప్రసాద్ మాజీ జిసిసి చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీమతి కొత్తపల్లి గీత మాట్లాడుతూ గిరిజన ప్రాంతాన్ని మరో పాతికేళ్ళు వైసీపీ ప్రభుత్వం వెనక్కి నెట్టివేసిందన్నారు అనేక జీవోలు, హక్కులు కాలరాస్తు ఈ రోజు గిరిజనులకు తీవ్ర నష్టం చేసిందన్నారు. ఎంతో సహజ సంపదలు వున్న గిరిజన ప్రాంతాన్ని కేవలం తమ స్వార్థ రాజకీయాలకు వాడుకునే ముడి సరుకుగా చూడటం బాధకలిగిస్తుందని ఇది సగటు గిరిజనుడు ఆవేదన అన్నారు. ఈ అవేదన పలితం ఏమిటో మరో పది రోజుల్లో ప్రజలు చూపిస్తారని అందుకు సర్వం సిద్దం అయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం సిద్దంకి గిరిజనులు సంసిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే కేంద్రంలో మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ రక్షణలో ఇవాళ దేశాన్ని అంతర్జాతీయ విపణిలో అగ్రగామిగా నిలిపారు అరకు కాఫీ నీ అంతర్జాతీయ శ్రేణిలో ఒక గొప్ప బ్రాండ్ గా మలిచి ఈ ప్రాంత కాఫీ రైతులకు ఎంతో మేలు చేశారన్నారు రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపిస్తే సహజ సౌందర్యాలకు నెలవైన ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ఆర్ధిక స్వాలంబన సాధించే దిశగా కేంద్రం ప్రభుత్వం కృషి చేసేలా మేము చొరవ తీసుకుంటామన్నారు. అలాగే గిరిజన నిరుద్యోగ యువతకు కల్పతరువైన జీవోనెం3, వంటి వాటిని పునరుద్ధరించి యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తామన్నరు మన దగ్గర సంపదలు వుంది సరైన యువ శక్తి వుంది కానీ వైసీపీ ప్రభుత్వం యువతను చెడు వ్యసనాలకు బానిస చేసి వారి శక్తిని నిర్వీర్యం చేసి కేవలం వారిని ఓటు వేసే యంత్రలుగా మలిచిన వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపక పోతే భవిష్యత్ తరాలకు భవిష్యత్ లేదన్నారు రాష్ట్రం క్షేమం కోసం త్రిమూర్తులుగా కలిసిన మన ప్రధాని నరేంద్ర మోదీ, తెదేపా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తో మనమంతా ఏకిభవించి వారి నిర్ణయానికి కట్టుబడి ఎన్డీయే వుమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారిని వుమ్మడి ఎంపి అభ్యర్థిగా వున్న మమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మీదేనన్నారు. మమ్మల్ని గెలిపించుకోవడమంటే మి పిల్లల భవిష్యత్ తీర్చి దిద్దుకోడమేనని హితవు పలికారు. అనంతరం చింతపల్లిలో జరిగే సభకు హాజరయ్యారు. సభలో వుమ్మడి కూటమి కార్యకర్తలు కొయ్యూరు నుంచి బారి ర్యాలీగా చింతపల్లికి చేరుకున్నారు.