పవన్ దిష్టిబొమ్మ దగ్ధంతో మైలపడిన ప్రదేశాన్ని పాలాభిషేకంతో శుద్ధి

  • పవన్ దిష్టిబొమ్మ దగ్ధంతో మైల పడిన ప్రదేశాన్ని పాలతో శుద్ధి చేసిన శింగనమల నియోజకవర్గం జనసేన శ్రేణులు

శింగనమల నియోజకవర్గం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ పిలుపు మేరకు బుక్కరాయసముద్రం మండల అధ్యక్షుడు జి. ఎర్రిస్వామి అధ్యక్షతన ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధంతో మైల పడిన ప్రదేశాన్ని పాలాభిషేకంతో శుద్ధి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాకే మురళీకృష్ణ మాట్లాడుతూ కూల్చివేతల ప్రభుత్వం మరొక్కసారి అమానుషానికి ఒడిగట్టిందని. అమాయకులైన వాలంటీర్లను భయపెట్టి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెబుతూ.. బుక్కరాయసముద్రం డా. బి ఆర్ అంబెడ్కర్ విగ్రహం సర్కిల్లో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వాలంటీర్ల పేరుతో యువత జీవితాలు నాశనం చేస్తున్న వైసిపి ప్రభుత్వం 5000 వేతనం ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటుంది. నాలుగేళ్లుగా ఉద్యోగాలు కల్పించకుండా ఐదు వేల జీవితానికి ఊడిగం చేయిస్తూ బ్రతుకులు నాశనం చేసింది ఎవరని ప్రశ్నించారు. వాలంటీర్ అని మభ్యపెట్టి ప్రభుత్వం ఉద్యోగాల ఉసేత్తకుండా మీ వయస్సు అర్హత లో నాలుగేళ్లు నాశనం చేసి అర్హత లేకుండా చేసింది ఎవరు?. మీ జీవితాలు ఎదిగే అవకాశాలు లేకుండా చేసి 5,000 దగ్గరే ఉంచింది ఎవరు?. వాలంటీర్ వ్యవస్థతో వాలంటీర్ల జీవితాలు మారలేదు వారిని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు బాగుపడుతున్నారు అనేది వాస్తవం కాదా?. వైసీపీ సభలు సమావేశాలకు ప్రజల్ని తీసుకొచ్చే బాధ్యత మీపై వేశారా లేదా?. మీ ప్రాంతాల్లో ప్రజలను మీ చేతే భయపెట్టిస్తున్నారా లేదా గ్రామ వాలంటీర్లు, మీ జీవితాలు అభివృద్ధి లేకుండా చేస్తున్నది ఈ ప్రభుత్వమే ఆలోచించండి అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జయమ్మ, జనసేన పార్టీ బుక్కరాయసముద్రం మండల అధ్యక్షుడు జి. ఎర్రిస్వామి, మండల ప్రధాన కార్యదర్శి అరటి తాహిర్.చరణ్, మండల నాయకులు మునింద్ర, మన్నల పెద్దిరాజు, ఏకాంత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.