ఎవరిని ఉద్ధరించడానికి జగన్ రెడ్డి సిద్ధం సభలు..!

• పత్రికా స్వేచ్చా స్వాతంత్రాలకు భంగం కలిగించడానికే పాత్రికేయులపై దాడులు.
• రాయలసీమ ద్రోహి జగన్
• 31వ రోజు 10వ డివిజన్ రాజమ్మ కాలనీలో కొనసాగిన మహిళలతో మాటామంతి కార్యక్రమం

  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత.

అనంతపురం, సోమవారం నాడు జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ మహిళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 31వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 10వ డివిజన్ రాజమ్మ కాలనీలో పర్యటించి స్థానిక మహిళలతో మమేకమయ్యి సమస్యలను తెలుసు కొని.ఈ విధంగా మాట్లాడారు అనంతపురం అర్బన్ నియోజక వర్గంలో ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయని జగన్ రెడ్డి సిద్ధం సభలను నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రజానీకానికి ఓరిగింది ఏమి లేదని ఉమ్మడి అనంతపురం జిల్లాకు సీఎం హోదాలో అనేక సార్లు వచ్చిన జిల్లాకు అనేక హామీలను ఇచ్చి తిరిగి అధికారం ముగుస్తున్న వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా కేవలం అధికార దాహంతో ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను అష్టకష్టాలకు గురిచేస్తూ సిద్ధం సభలు నిర్వహిస్తున్నాడని మరోవైపు చూస్తే రాష్ర్టంలో రైతన్నల ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయని, నిరుద్యోగం, పేదరికం వైకాపా కాలంలో ఏటికేడు పెరుగుతుందని మద్యపాన నిషేధ హామీని తుంగలో తొక్కి మహిళల మంగళ సూత్రాలు జగన్ రెడ్డి తెంచాడని ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని వీరంతా జగన్ రెడ్డిని ఓడించడానికి సిద్దంగా ఉన్నారని, జగన్ రెడ్డికి జైలు జీవితం అనుభవించడానికి సిద్దంగా ఉండాలని, అదేవిధంగా ఆదివారం సిద్దం సభలో ఆ సభను కవరేజ్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి దినపత్రిక జిల్లా ఫోటో గ్రాఫర్ కృష్ణ పై వైకాపా రౌడీ ముఖల విచక్షణా రహితంగా కొట్టి గాయపరిచారని వీరందరినీ జగన్ రెడ్డి చొక్కాలు మడతపెట్టి అనేపదాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 అనే పదాలను పదే పదే వాడుతూ పరోక్షంగా ఉసి గొల్పుతున్నడని ఈ విధానం రాష్ట్ర పత్రికా స్వేచ్చా స్వాతంత్రాలకు విఘాతం కలిగిస్తుందని. రాయలసీమ ద్రోహి జగన్ అని వైకాపా పాలన కాలంలో ఏ ఒక్క తాగు,సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేదని ఇంకా వేసవికాలం మొదలవ్వకనే రాయలసీమ నీటి ఎద్దడితో అల్లాడుతుందని ఈ సారి జగన్ కు బుద్ది చెప్పాడానికి రాయలసీమ ప్రజలు సైతం సిద్దంగా ఉన్నారని, కచ్చితంగా రాష్ర్టంలో వచ్చేది జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమే అని సంక్షేమం అభివృద్ధి సమపాలనలో జరిగి రాష్ట్రం అభివృద్ధి వైపు పయణిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.