లింగపాలెం జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం. “జగనన్న ఇల్లు -పేదలందరికీ కన్నీళ్లు” జనసేన పార్టీ సామాజిక పరిశీలన కార్యక్రమం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం ధర్మాజిగూడెం, మఠంగూడెం, సుందరరావు పేట గ్రామ ప్రాంతాల్లో జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇంఛార్జ్ మేకా ఈశ్వరయ్య ఆదేశాల మేరకు పరిశీలించిన లింగపాలెం మండల అధ్యక్షులు పంది మహేష్ బాబు ఆధ్వర్యంలో సందర్శించడం జరిగినది. మండల అధ్యక్షుడు పంది మహేష్ బాబు మాట్లాడుతూ ఏమాత్రం నివాసయోగ్యం కాని మౌళిక వసతులు లేని స్థలాలను కేటాయించి జగనన్న కాలనీలు అని ఇంటికి సెంటున్నర భూమి ఇచ్చి చేతులు దులుపుకుని కొన్ని ఇళ్ళ స్థలాలు కోర్టు కేసులో ఉండడం, కొన్ని స్థలాలు స్మశానంలో వుండడం వల్ల లబ్ధి దారులకు సొంతింటి కలను నెరవేర్చకుండా జగనన్న కాలనీలు మాటలకే ఈ వైసీపీ ప్రభుత్వం పరిమితం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మాదాసు కృష్ణ, ఉపాధ్యక్షులు తాళం మల్లేశ్వరరావు, కార్యదర్శి బంటు సామ్యెల్ రాజు, మఠంగూడెం గ్రామం జనసైనికుడు సాయిల ప్రేమ్ కుమార్, బోగోలు గ్రామం జనసైనికుడు తాడేపల్లి బాబూరావు, కలరాయనగూడెం గ్రామం జనసైనికులు మొహ్మద్ హమద్ షరీఫ్ మరియు షేక్ సుభాని పాల్గొన్నారు.