శ్రీశ్రీశ్రీ బంగారుతల్లి గ్రామదేవత ఉత్సవాలలో పాల్గొన్న గర్భాన

పాలకొండ, శ్రీశ్రీశ్రీ బంగారుతల్లి గ్రామదేవత అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఘటాలను మ్రొక్కి పూజించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు అందరూ కలిసి గర్భాన సత్తిబాబుని ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పొట్టి గ్రామ పెద్దలు, జన సైనికులు పాల్గొన్నారు.