మంగళగిరిలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

మంగళగిరి, ఈ నెల 12, 13, 14 తేదీల్లో ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళగిరి నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి, పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ…

  • జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమం 12, 13, 14 తారీకులలో మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతుందని తెలియజేశారు.
  • ఇందులో భాగంగా “పేదలందరికీ ఇల్లు పథకం” కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ 28 లక్షల 30 వేల మందికి ఇల్లు కట్టేస్తామని హామీ ఇచ్చారు.
  • తొలి విడతలో 18 లక్షల 63 వేల 552 గృహాలు జూన్ (2022) నెల నాటికి ఇస్తామని హామీ ఇచ్చారు.
  • కానీ కేవలం వారు 1 లక్ష 52 వేల ఇళ్లను మాత్రమే నిర్మించారు.
  • జగనన్న కాలనీలకు రాష్ట్రవ్యాప్తంగా భూసేకరణకు 68 వేల 677 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
  • 10 నుంచి 20 లక్షల ఉన్న భూమిని 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వరకు వారు కొన్నారు.
  • అంటే దాదాపు 23,500 కోట్లు వెచ్చించి, వారు ఆ భూములు కొన్నారు.
  • ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములు కొనుగోలు దానిలో వందల కోట్లు అవినీతి చేశారు.
  • అలాగే మౌలిక సదుపాయాల కోసం మరో 34 వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
  • ఇంత పెద్ద మొత్తంలో డబ్బును వెచ్చించిన కనీస మౌళిక సదుపాయాలు కూడా లేనకుండా ఇల్లులను నిర్మించారు.
  • కేవలం వైసీపీ నాయకులకు వందల కోట్లు అప్పనంగా కట్టబెట్టడం కోసమే ఈ “జగనన్న ఇల్లు – పేదలందరికీ ఇల్లు” పథకం.

కావున మంగళగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు అందరూ కలిసి 12, 13, 14 తేదీలలో ఈ మూడు రోజులు జరగబోయే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీ రావు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జే.ఎస్.ఆర్), మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ నాయకులు షేక్ కైరుల్లా, మంగళగిరి నియోజకవర్గ నాయకులు చిట్టెం అవినాష్, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుభాని, ఉండవల్లి గ్రామ నాయకులు శెట్టి రామకృష్ణ, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు బత్తినేని అంజయ్య, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు కౌపరతు సుందరయ్య, సీనియర్ నాయకులు నారాయణ, ఏడుకొండలరావు, ప్రకాష్ రావు, చంద్రశేఖర్, బేతపూడి గ్రామ నాయకులు శివన్నారాయణ, మంగళగిరి పట్టణ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, మంగళగిరి మండల జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లీళ్ళ సాయి నందన్, చిల్లపల్లి యూత్ సభ్యులు మేకల చంద్రశేఖర్, జనసైనికులు శివ తదితరులు పాల్గొన్నారు.