బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు…. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సోషల్ ఆడిట్ కార్యక్రమం జగనన్న ఇళ్ళు – పేదలందరికీ కన్నీళ్లు .#ఝగనన్నంఒసం లో భాగంగా రెండవ రోజు కోరుకొండ మండలం, గాధరాడ గ్రామంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి శ్రీమతి వెంకటలక్ష్మి, నియోజవర్గ సీనియర్ నేతలు, జనసైనికులు, గాదరాడ గ్రామ పెద్దల సమక్షంలో గాదరాడ గ్రామంలో జరిగింది. ముందుగా రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ గార్కి, జాతిపిత మహాత్మా గాంధీ గార్కి పూలమాలలు అర్పించి.. ఘన నివాళులు సమర్పించి.. అనంతరం పెద్ద గ్రామమైన గాధరాలలో ఎప్పటి వరకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినట్టుగా ఏ ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించలేదని… స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నెంబర్ వన్ నియోజవర్గం అంటూ పత్రికా ప్రకటనలో డప్పుకోవడం తప్ప.. ప్రగల్బాలు చెప్పు కోవడం తప్ప.. ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని… తక్షణమే వందలాది మంది పేదలకు సరైన నివాసయోగ్యమైన ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని బత్తుల దంపతులు మీడియా సాక్షిగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు గళ్ళ రంగా, అడ్డాల శ్రీను, చిక్కిరెడ్డి దొరబాబు, దేవన దుర్గాప్రసాద్, సంగుల రమేష్, జోకా శేషగిరి మైరెడ్డి బుజ్జి, మైరెడ్డి సూరిబాబు, చిట్టిప్రోలు సత్తిబాబు, చల్లా రాము, అడబాల ఆడివిష్ణు, శంకరం, వెంకటేష్, అబ్బిరెడ్డి మణికంఠ, పాలం రమేష్, పాలిశెట్టి సత్తిబాబు, మద్దిరెడ్డి బాబులు, బొమ్ముల రాజు, తోరాటి శ్రీను, ఆనందాల గోవింద్, కురుమళ్ళ మహేష్, ముక్కపాటి గోపాల్, కర్రీ దొరబాబు, కవల శ్రీరామ్, పెన్నమరెడ్డి విజయ్, త్రిమూర్తులు, అరిగెల రామకృష్ణ, సురపురెడ్డి రాజారావు, చాపల లక్ష్మి, తోట అనిల్ వాసు, కొత్తపల్లి బుజ్జి ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.