జగనన్న కాలనీలో పర్యటించిన సిజి రాజశేఖర్

పత్తికొండ నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పత్తికొండ నియోజకవర్గం, పత్తికొండ పత్తికొండ టౌన్ కి సంబంధించి ఆదోని రోడ్ నందు ఉన్న జగనన్న కాలనీలను జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ.. #FailureOfjaganannaColony హ్యష్ ట్యాగ్ తో సోషల్ మీడియా క్యాంపెయిన్ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం పత్తికొండ నియోజకవర్గం, పత్తికొండ గ్రామ పంచాయతీకి సంబంధించిన జగనన్న కాలనీలకు సంబంధించి పత్తికొండ మండల నాయకులు నూర్ భాషా, వడ్డే విరేష్, అనిల్, జనసేన నాయకులతో కలిసి జగనన్న కాలనీలు సందర్శించాం. ఈ జగనన్న కాలనీల పేరుతో పేద ప్రజలకు లోతట్టు ప్రాంతాలలో స్థలాలు ఇచ్చి, వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదని, ఇళ్లు కట్టుకోవడం అనేది పేదవాడి కల అని, వారికి ప్రభుత్వము ఓటరుగా చూడటం మాని, మంచి ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. స్థలాలు చౌడు భూమిలో ఇచ్చారు, ముప్పు ప్రాంతాల్లో కేవలం పునాది వేయడానికి 2 లక్షల వరకు, ఖర్చు అవుతుంది పేదవాడు మొత్తం ఇల్లు ఎలా కట్టుకోగలడు అని ప్రశ్నించారు. పత్తికొండ గ్రామ పంచాయతీకి సంబంధించి ఇచ్చిన జగనన్న కాలనీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కాలనీలకు వెళ్లే రహదారి ఈ ప్రాంతంలో చెరువును తలపిస్తున్నాయి ఈ ప్రాంతంలో ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. వర్షాకాలంలో నీరు మొత్తం చేరి ఇక్కడ జలమయం అవుతుంది. ఈ ప్రదేశాల్లో ఇల్లు నిర్మిస్తే పేదలకు ఇబ్బందులకు గురి కావల్సి వస్తుంది అన్నారు.
జగనన్న కాలనీలో అనేవి రాష్ట్రంలో అతిపెద్ద స్కాం, రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తాను అని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణాలు చేయకుండా పేద ప్రజలను మోసం చేసింది,
జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లుగా మారాయి, జగనన్న కాలనీలో ద్వారా కొంతమంది అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకున్నారు తప్ప అసలైన లబ్ధిదారులకు ఎటువంటి న్యాయం జరగలేదు,
లబ్ధిదారులకు ఇచ్చిన ఇల్లు స్థలాలు ప్రజలు నివసించే ప్రాంతాలకు చాలా దూరంగా మరియు కాలువల పక్కన ఇచ్చారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తాను అని చెప్పి ఇప్పుడు లబ్ధిదారులనే ఇంటి నిర్మాణం చేసుకోమని లేకపోతే ఇంటి పట్టా రద్దు చేస్తామని లబ్ధిదారులను బెదిరిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, నూర్ భాషా, అనిల్, వడ్డే విరేష్, రమేష్, లింగ, వెంకటేష్, రాముడు, సురేష్, మరియు తదితరులు పాల్గొన్నారు.