ఏలూరు నగరంలో జనసేన ఆధ్వర్యంలో విరివిగా చలివేంద్రాల ఏర్పాటు

ఏలూరు: ఏలూరు నగర ప్రజలతోపాటు, నగరానికి వచ్చే పరిసర ప్రాంతాల ప్రజలు ఎండ వేడిమికి, వేసవి తాపానికి గురికాకుండా జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్లలో వేసవి చలివేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 29వ డివిజన్ సుబ్బమ్మ దేవి స్కూల్, మినీ బైపాస్ లోనూ, 18వ డివిజన్ లోనూ జనసేన ఆయా డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసి, స్వయంగా ఆయన మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు ఎన్.కాశీ నరేష్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్ రాజేష్, కె.వాణిశ్రీ, పి.విజయ్, అధికార ప్రతినిధి సాయి చరణ్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ డి.రాజు, 1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ సుజాత, టౌన్ మహిళ కార్యదర్శిఉమాదుర్గ, నాయకులు ఎం శ్రీనివాస్, వి. పండు, శ్రీను, కె. కృష్ణ, నాయుడు, అర్ సూర్యనారాయణ, బి. నాగేశ్వరరావు, లెహర్ స్థానిక నాయకులు ఎమ్. రవి, సోంబాబు, బాబీబి. రాము, జానీ, కృష్ణ, పి. శ్రీనివాస్, సాయి, పి.కృష్ణ, పత్తిరాజా, రామారావు, వెంకటేశ్వరరావు, బి.సుధీర్, పూర్ణ, సాయిరాం, సింగ్, కె.అప్పారావు, అర్.దుర్గా ప్రసాద్, బి. గోవిందు, పవన్, పి.రాము, బాలు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.