జగనన్న కాలనీలు కాదు అవి జగనన్న మురికి కూపాలు: నేరేళ్ళ

  • కాలనీల పేరుతో కోట్లు దండుకున్న వైసీపీ దండుపాలెం బ్యాచ్
  • పేద ప్రజల్ని నమ్మించి మోసం చేసిన జగన్ రెడ్డి
  • ఇప్పటివరకు కనీసం ఐదు శాతం కూడా పూర్తి కానీ గృహ నిర్మాణాలు
  • శివారు ప్రాంతాలు కావటంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు
  • వైసీపీ పాలనలో ప్రజలకు కూడూ, గూడూ రెండూ కరువే
  • జగన్ రెడ్డిని ఇంకోసారి నమ్మితే ఈ రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడు
  • గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కడుతున్నవి కాలనీలు కాదని జగనన్న మురికి కూపాలని జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ విమర్శించారు. జగనన్న కాలనీల పేరుతో పేద ప్రజల్ని ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో ప్రపంచానికి తెలియచేసేలా జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా బుడంపాడు గ్రామంలోని జగనన్న కాలనీలను జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు సందర్శించి అక్కడి క్షేత్రస్థాయి దుస్థితిపై ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయానికి అప్ లోడ్ చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ.. తన మాయమాటలతో పేదల్ని ఇంతగా మోసం చేసిన ముఖ్యమంత్రి బహుశా ప్రపంచంలో మరొకరు ఉండరని మండిపడ్డారు. జగనన్న కడుతుంది ఇల్లు కాదు ఊర్లు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన వైసీపీ నేతలు తమ నాలుగేళ్ళ పాలనలో నాలుగు శాతం కూడా ఇల్లు నిర్మించలేదని ధ్వజమెత్తారు. కొన్ని చోట్ల ఇంకా పనులు మొదలు పెట్టలేదు, మరికొన్ని ప్రాంతాల్లో పునాదుల దగ్గరే ఇళ్ళు ఆగిపొయాయి, కొద్దిపాటి వర్షానికే కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. మరి ఇంకెప్పుడు ప్రజలకు ఇల్లు నిర్మించి ఇస్తారని ధ్వజమెత్తారు. ఇదంతా పేదల్ని నమ్మించి మోసం చేయటం కాదా అని వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. జగనన్న కాలనీల పేరుతో కోట్లు దండుకుంది అంతా వైసీపీ దండుపాలెం బ్యాచేనని ధ్వజమెత్తారు. ఊరికి దూరంగా తొండలు కూడా గుడ్లు పెట్టని ప్రాంతాల్లో ఎకరం లక్ష కూడా చేయని చోట్ల అరవై, డెబ్భై లక్షలు పెట్టి కొని వేల కోట్ల ప్రజాధనాన్ని వైసీపీ నేతలు, దోచుకున్నారని నేరేళ్ళ సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ వైసీపీ పాలనలో కూడూ, గూడూ కూడా కరువేనన్నారు. వైసీపీ నేతలు సంక్షేమం ముసుగులో చేస్తున్న అరాచక, నియంత పాలనను ప్రజలు గుర్తించాలని కోరారు. వైసీపీ దాష్టీకాలపై, అసమర్ధ, అవినీతి పాలనపై ప్రజల్లో మరింత అవగాహన కలిగేలా జనసేన పార్టీ మరిన్ని వినూత్న కార్యక్రమాలను రూపొందిస్తుందన్నారు. జగన్ రెడ్డిని ఇంకోసారి నమ్మితే ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడని ఆళ్ళ హరి ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలను సందర్శించిన వారిలో కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీ దుర్గ, జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పు వెంకట రత్తయ్య, నగర ఉపాదక్ష్యుడు కొండూరు కిషోర్, చింతా రాజు, ప్రధాన కార్యదర్సులు సూరిశెట్టి ఉదయ్, కటకంశెట్టి విజయలక్ష్మి, రాష్ట్ర కార్మిక సంఘాల నాయకుడు సోమి శంకరరావు, వీరమహిళలు పాకనాటి రమాదేవి, అనసూయ, మల్లేశ్వరి, అరుణ, సామ్రాజ్యం, ఆషా, రమాదేవి, నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.