Warangal: జిల్లాలో డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి – ఆకుల సుమన్

వరంగల్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు డ్రగ్స్ దొరకడం దురదృష్టకరమని, జిల్లాలో డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జనసేనపార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ గారు అన్నారు, యువత డ్రగ్స్ మరియు మత్తు పదార్ధాల వైపు మొగ్గు చూపి వారి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారని ఆవేదం వ్యక్తం చేసారు, డ్రగ్స్ అమ్మిన వారి పై, సేవించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలు నిర్ములించడం కేవలం పోలీసుశాఖ వారితో సాధ్యం అవుతుందని తెలిపారు, డ్రగ్స్ ఫ్రీ వరంగల్ గా తీర్చిదిద్దేన్దుకు జనసేనపార్టీ సంపూర్ణ సహకారం పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేసారు.