జగనన్న ఇల్లు పేద ప్రజల కన్నీళ్లు

  • టిడ్కో ఇల్లు, జగనన్న కాలనీల భాదితుల తరుపున జనసేన గళం
  • ప్రజల సమస్యల పరిష్కారమే జనసేన ధ్యేయం
  • పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి

పిఠాపురం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ నెల 12, 13, 14 వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జగనన్న కాలనీలను సందర్శించి ప్రభుత్వ తీరును పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేసి ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ టిడ్కో ఇల్లు పూర్తయి మూడున్నర సంవత్సరాలు పూర్తయిన ఈ ప్రభుత్వం లబ్ధిదారులకు వాటిని అప్పగించలేదన్నారు. నివాసాలకు ఏ మాత్రం ఇళ్ల స్థలాల నుంచి జగనన్న కాలనీల అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన మహోద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగా ఈ నెల 12, 13, 14వ తేదీల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో గృహ నిర్మాణ పథకాలు జగనన్న కాలనీలో సముదాయాలను సందర్శించి అవి ఏయే దశల్లో ఉన్నాయో పరిశీలిస్తామన్నారు. మూడు రోజుల పాటు ఆయా కాలనీలో విస్తృతంగా పర్యటించి లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రతి అంశాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సోషల్ మీడియాలో #జగనన్నమోసం ఈ హాష్టాగ్ అప్లోడ్ చేస్తామన్నారు. జగనన్న కాలనీలో తిష్టవేసిన ప్రతి సమస్యపై జనసేన ప్రజల దృష్టికి తీసుకొచ్చి అవి పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వం పై ఉద్యమ బావుట ఎగురవేస్తామన్నారు. మీ దృష్టి మొత్తం మట్టి తవ్వకాలు, ఇసుక మాఫియా మీదే ఉన్నాయి తప్ప ఒక్క బ్రిడ్జి నిర్మాణం అయిన, రోడ్ల నిర్మాణం జరిగిందా అని ప్రశ్నించారు. జగనన్న పేద ఇళ్ళ ప్రజల కన్నీళ్లు ఇసుక కొరత, తాగునీటి సరఫరా, విద్యుత్ లైన్లు, వంతెనలు, రహదారులు, డ్రైనేజీల నిర్మాణం ఇలా ప్రతి మౌలిక సదుపాయంపై ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. ప్రతి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, క్రియాశీల కార్యకర్తలు ఈ మహోద్యమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. అలాగే కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, గోపు సురేష్, గ్రామ పంచాయతీ జనసేన వైస్ ప్రెసిడెంట్ ఎనుగంటి హరిబాబు, అడ్వకేట్ సిరిపిరెడ్డి గణేష్, గున్నబత్తుల రాంబాబు, మదేపల్లి పద్మరాజు, పెనుగొండ సోమేశ్వరరావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, కంద సోమరాజు, బండి అప్పారావు, రౌతు శివబాబు, దేసిరెడ్డి సతీష్, కసిరెడ్డి నాగేశ్వరరావు, జనసైనికులు, వీరమహిళలు, తదితరులు పాల్గొనడం జరిగింది.