వంపురు గంగులయ్య ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు పేద ప్రజల కన్నీళ్లు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం మినుములూరు పంచాయితీ సంగొడి గ్రామంలో 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా అసంపూర్తి నిర్మాణంలో ఉన్నా ఇల్లు, జనసేన పార్టీ చేపట్టిన హాష్ టాగ్ “జగనన్న ఇల్లు పేద ప్రజల కన్నీళ్లు” కార్యక్రమంలో వెలుగు చూసిన ఆశక్తికరవిషయం ఏమిటనగా వైసీపీ సర్పంచ్ గా పోటీ చేసిన అభ్యర్థి మూడవ వెంకన్న ఇల్లు అసంపూర్తిగా ఉండడం వైసీపీ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇదే వైనం గిరిజన ప్రాంతంలో ఉందని తెలియపరుస్తున్నాం ఒకటి, అరగా మంజూరు చేసిన ఇళ్లు కూడా అసంపూర్తిగా ఉండడం జగనన్న ఇల్లు పేద ప్రజల కన్నీళ్లు కార్యక్రంలో వెలుగు చూసింది. ఈ కార్యక్రమం జనసేనపార్టీ పాడేరు డా.వంపురు గంగులయ్య అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకటేష్ పాంగి, లింగరాజు, కొర్ర కమల్ హాసన్, తరడా రమేష్ నాయుడు, వంపురు సురేష్, సాలేబు అశోక్, ప్రసాద్, పవన్ కుమార్, మాదేలి నాగేశ్వరరావు గ్రామస్తులు పాల్గొన్నారు.