జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్లు

కర్నూలు, పాణ్యం, రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 12 13 14వ తేదీల్లో జరగబోయే జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో చేపడుతున్నామని జనసేన పార్టీ జిల్లా నాయకులు పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ చింత సురేష్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక బిర్లా కాంపౌండ్ జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవరత్నాల్లో ఒక రత్నం జగనన్న ఇల్లు రాష్ట్రంలో 28 లక్షల మంది లబ్ధిదారులకు జగనన్న ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆనాడు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు దీనికోసం 68 లక్షల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. అలాగే ఆ కాలనీలో ఒక మౌళిక పరిస్థితుల రూపంలో అభివృద్ధి చేయడానికి సుమారు 34 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది కానీ ఈరోజుటి వరకు ఏ యొక్క కాలనీ కూడా పూర్తి కాలేదు ప్రభుత్వం యొక్క అవినీతి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రభుత్వానికి చూపించడానికి ఈ కార్యక్రమాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 12, 13, 14 తేదీలలో జగనన్న కాలనీలో పర్యటించి 14వ తేదీన సోషల్ ఆడిట్ జనసేన పార్టీ ఇస్తుందని తెలియజేశారు. సోషల్ ఆడిట్లో ఏ కాలనీలో ఎన్ని ఇల్లు పూర్తిగా నిర్మించారు ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి ప్రభుత్వం ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించింది. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నామని అన్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, బజారి, షబ్బీర్, రాంబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.