కలవచర్ల గ్రామంలో జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్లు

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కలవచర్ల గ్రామ సచివాలయం జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కలవచర్ల గ్రామములో ఊరికి బయట జనావాసానికి బాగా దూరంగా సుమారు 5క్మ్ ఊరికి బయట 11 ఎకరాల్లో రమారామి 465 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించామని చెప్పి ఎంపీటీసీ ఎలక్షన్స్ లో స్లిప్పులు ఇచ్చారు. అందులో 200 మందికి పైగా పట్టాలు కేటాయించలేదు. కొంతమందికి పట్టాలు ఇచ్చారు కానీ ఆ స్థలాన్ని ప్లాట్స్ కింద విడగొట్టకుండా ఉండటం వలన ఎవరి స్థలం ఎక్కడుందో తెలీని పరిస్థితి పైగా పట్టాలు వచ్చిన వాళ్ళు ఇళ్ళు కట్టుకోకపోతే పట్టాలు వెనక్కి తీసుకుంటాం అని బెదిరిస్తున్నారు. అనే విషయాలు మీద విసిటింగ్ కొచ్చిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి కలవచర్ల పంచాయతీ సెక్రెటరీతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలవచర్ల జనసేన పార్టీ నాయకులు చల్లా ప్రసాద్, అడ్డాల భగవాన్, సబ్బు గణేష్, మండేలా రామకృష్ణ, కోరుకొండ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పోసిబాబు, కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు చదువు నాగు, చదువు ముక్తేశ్వరావు, కొచ్చర్ల బాబి, తెలగంశెట్టి శివ, రాజానగరం మండలం జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ సుంకర బాబ్జి, మెడిద వీరబాబు తదితరులు పాల్గొన్నారు.