తణుకు జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

తణుకు నియోజవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు మరియు జగనన్న మోసం అనే కార్యక్రమంలో భాగంగా తణుకు నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు ఆధ్వర్యంలో జగనన్న కాలనీలు సందర్శించడం జరిగింది. అక్కడ లబ్ధిదారులను ప్రశ్నించగా మాకు ఈ కాలనీలో ఏ విధమైన మౌలిక సదుపాయాలు వాటర్ స్పెషల్ టీ, కరెంటు, రోడ్లు డ్రైనేజీ ఇటువంటి ఏమీ లేకుండా మమ్మల్ని ఇక్కడ ఇల్లు కట్టుకోమని ఒత్తిడి తీసుకురావడం జరిగింది అని స్థానికంగా లబ్ధిదారులు వాపోయారు. కార్యక్రమంలో తణుకు తణుకు మండలం అధ్యక్షులు చిక్కాల వేణు, ఇరగవరం మండలం అధ్యక్షులు ఆకేటి కాశి, తణుకు టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, తణుకు టౌన్ యూత్ ప్రెసిడెంట్ గర్రె తులసీరామ్, మండపాక గ్రామ ప్రెసిడెంట్ జానా వెంకటలక్ష్మి, తణుకు మండలం ఉపాధ్యక్షురాలు తెల్లగా రెడ్డి లక్ష్మి, మరియు జవ్వాది ప్రసాద్, జానా శ్రీనివాస్, మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.