చీరాల జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు

#JaganannaMosam

చీరాల నియోజకవర్గం: జనసేన పార్టీ తలపెట్టిన జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు సామాజిక పరిశీలన కార్యక్రమం ఆదివారం చీరాల నియోజకవర్గంలోనీ చల్లారెడ్డి పాలెం పంచాయతీ పరిధిలో చేనేతపురి-3 గ్రామంలో పసుపులేటి సాయి మరియు బూడిద వరం ఆధ్వర్యంలో జరిగింది. జగనన్న కాలనీల పేరిట పేదలకు జరుగుతున్న మోసాన్ని, చాలీసాలని స్థలాలో కట్టుకున్న ఇల్లు సౌకర్యవంతం లేక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న విధానాన్ని జనసేన నాయకులు వివరించడం జరిగింది. అతి తక్కువ స్థలాలలో నిర్మించే గృహాల వలన పేద ప్రజలు సౌకర్యాల లేమిలతో బాధపడుతున్నారని అలానే ఏర్పాటు చేస్తున్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా (రహదారులు, మురుగు పారుదల సౌకర్యం, విద్యుత్ సదుపాయం), ప్రభుత్వం కేటాయించిన పరిధి కన్నా ఒక అడుగు ఎక్కువ జరిగి కట్టుకుంటే ఆ లబ్ధిదారునికి రావలసిన బిల్లు రాకుండా చేయడం, ఇలా పేద ప్రజలను ఇక్కట్లుకు గురి చేయడం అనేది దారుణాతి దారుణం అని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇబ్బంది పడుతున్న లబ్ధిదారుల చేత మాట్లాడిద్దామంటే తమ సమస్యల గోడును విన్నవించుకుంటే రావాల్సిన బిల్లులు రాకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డం పడతారనే ఆందోళనతో వాళ్లు ప్రత్యక్షంగా పాల్గొనకుండా పరోక్షకంగా జనసేన నాయకులకు తమ సమస్యలను విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ భూపతి మనోజ్ కుమార్, జనసేన కార్యకర్తలు కర్ణ కిరణ్ తేజ, పింజల సంతోష్, లలిత్ కుమార్ దోగుపర్తీ, ఆమోదగిరి పట్నం మరియు వేటపాలెం జనసేన సైనికులు వరుణ్, లంకా భార్గవ్, పి. భాను, హేమంత్, వెంకట్, శ్రీను, కిట్టు, సాయి, వంశీ, నరేశ్, రాజు మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.