జగ్గు భాయ్ నీ పద్ధతి మార్చుకో!!

  • జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో వీరమహిళల నిరసన

అనంతపురం: జగ్గు భాయ్ నీ పద్ధతి మార్చుకోకపోతే.. జనసేన వీర మహిళలు పాదరక్షకులతో నీకు బడిత పూజ చేస్తారు ఒళ్ళు జాగ్రత్త!! అంటూ.. అనంతపురం జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో అనంతపురం జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో వీరమహిళలు నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం సి.బి.ఐ అనుబంధ చార్జ్ షీట్ ను సి.బి.ఐ కోర్టులో ప్రవేశపెట్టింది అందులో మీ చెల్లి షర్మిల గారు, మాజీ సిఎస్ అజయ్ కల్లం గారు… మీ భార్య భారతి రెడ్డి గారి పి.ఏ సునీల్ మరి కొంతమందిని విచారించిన స్టేట్మెంట్లలో మీ బ్రతుకులన్నీ బట్టబయలు అయినాయి. వివేకానంద రెడ్డి గారి హత్య వ్యవహారంలో మీ కుటుంబ సభ్యులకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ విషయ వ్యవహారాలు ప్రజల్లో చర్చ జరుగుతాయని దురుద్దేశంతో కుట్రపూరితంగా.. డైవర్ట్ రాజకీయాల్లో భాగంగా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భార్యల ప్రస్తావన మరియు ఇతరుల భార్యల గురించి, వ్యక్తిగత జీవితాల గురించి ప్రస్తావన చేసావని మాకు అర్థమయింది. కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు మీ హత్య రాజకీయాలు, కోడి కత్తి వ్యవహారాలు అన్ని అర్థమయిపోయినాయి. కానీ విధి లేని పరిస్థితుల్లో నీకు సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి సమాధానం చెబుతున్నాం. వైసీపీ నాయకుల్లారా? కార్యకర్తలారా? జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడితే ఉచిత సలహాలు ఇచ్చే మేధావులారా!! ప్రభుత్వ ధనం ఖర్చు చేసి బహిరంగ సభలు పెట్టి ముఖ్యమంత్రి హోదాలో ఇతరుల వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదని జగ్గు భాయ్ కి చెప్పండి? వినకపోతే ఇంత గడ్డి పెట్టండి? అని లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి హెచ్చరించారు.