అందరూ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను: అతికారి దినేష్

ఉమ్మడి కడప జిల్లా, రైల్వే కోడూరు, ఓరంపాడు గ్రామం వద్ద తిరుపతి నుండి కడపకి వెళ్తుండగా లారీని ఢీకొన్న ఆర్టీసి బస్ ప్రమాదంలో 6 మంది ప్రాణాలు కోల్పోయారు అన్న విషయం తెలియంగానే చాలా దిగ్భ్రాంతికి గురయ్యానని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తూ దాదాపు 20 మందిపైగా తీవ్ర గాయాలు పాలయ్యారనీ, అందరూ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని, క్షతగాత్రులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకొని మెరుగైన వైద్యం అందించి, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని రాజంపేట జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని రాజంపేట జనసేన నాయకులు అతికారి దినేష్ తెలిపారు.