ధవళేశ్వరంలో జన చైతన్య శంఖారావం

రాజమండ్రి రూరల్, ధవళేశ్వరం గ్రామం జనార్ధనస్వామి కాలనీలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తలపెట్టిన జన చైతన్య శంఖారావ కార్యక్రమంలో అడుగడుగునా ప్రజా సమస్యలను విన్నవించుకున్న కాలనీవాసులు ముఖ్యంగా శానిటైజేషన్ డ్రైనేజీ వ్యవస్థ డంపింగ్ యార్డ్స్ గురించి తమ సమస్యలను కాలనీవాసులు విన్నవించుకోవడం జరిగింది. దుర్గేష్ మాట్లాడుతూ తొందరలోనే సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ మండల ప్రెసిడెంట్ చప్ప చిన్నారావు, కార్యదర్శి బీర ప్రకాష్, కార్యదర్శి అమీనా, శివారెడ్డి, కిషోర్ నాయుడు, నాని, పెంట బలరాం, మేక సత్యనారాయణ, ఏజిఆర్ నాయుడు, మట్టపర్తి నాగరాజు, ఆటో బుజ్జి, ఆనంద్, సాయి రామ్, సాయి, వంశీ, సురాడ సత్తిబాబు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.