జులై 15న జన ఘోష- జనసేన బరోసా ప్రారంభం

  • సమస్యల పరిష్కారమే జనసేన ధ్యేయం
  • క్షేత్రస్థాయిలోకి నియోజక వ్యాప్తంగా ప్రతి పల్లెకు అధినేత పవన్ కళ్యాణ్ వారాహి హామీలు
  • ఉరవకొండలో జనసేన జెండా ఎగురవేస్తాం
  • జనసేన జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్

ఉరవకొండ: గత నాలుగున్నర సంవత్సర కాలంలో అధికార వైసిపి అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. జనసేన అధికారంలోకి వస్తే జరగబోయే మేలును వివరిస్తూ జులై 15వ తేదీ నుండి జన ఘోష – జనసేన బరోసా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జనసేన జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ తెలిపారు. స్థానిక జనసేన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గౌతమ్ కుమార్ మాట్లాడుతు జనఘోష – జనసేన బరోసా కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ నియోజకవర్గంలోని 5 మండలాలు ప్రతి పంచాయతీలలో ప్రతి గ్రామంలో రాబోవు రోజుల్లో విస్తృతంగా పర్యటిస్తామన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేసుకొని స్థానిక ప్రజలతో మమేకం అవడం ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. అలాగే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలో ఇచ్చే హామీలకు విస్తృత స్థాయిలో ప్రచార కల్పిస్తూ.. జనసేన పార్టీని ఆదరించి, అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. వైసిపి అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారో తెలియచేస్తామన్నారు. స్థానిక సమస్యలపై సమరభేరి ముగిస్తూ జనవాణి వినిపిస్తామన్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వైసిపిని గద్దె దింపుతాం.. ఉరవకొండలో జనసేన జెండా ఎగురవేస్తామని జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, విడపనకల్ గోపాల్, వజ్రకరూరు అచనల కేసవ, బెలుగుప్పా సుదీర్, కుడెరు నగేశ్, దేవేంద్ర, ఉపాధ్యక్షులు రాజేశ్, మళ్లి కార్జున రమేశ్, ఓబులేసు, నీలకంఠ, బోగేశ్, మని కుమార్, సోము మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.