రా కదలిరా సభకు బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో కదిలిన జనసైనికులు

నూజివీడు: చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలి రా భారీ బహిరంగ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ నుంచి కార్ల ర్యాలీతో జనసేన నాయకులతో కలిసి సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు పాశం నాగబాబు, దుర్గ ధార్మిక సభ్యురాలు నిట్ల ఉమామహేశ్వరి, జక్కుల లక్ష్మి, జ్యోతి, జనసేన నాయకులు తోట వెంకట్రావు వెంకట్రావు, ఏనుగుల చక్రి ,షేక్ ఇమ్రాన్, గొల్లపల్లి శ్రీకాంత్, భవిరిశెట్టి వీరయ్య, తాలెం చెన్నారావు, పసుపులేటి సందీప్, వినయ్, గొల్లపల్లి గిరి,కడియం శ్రీను, రెడ్డీ సంతోష్, బజారు నందీశ్వర్, కరెడ్ల స్వామి, జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.