మునగల దోరువు గ్రామ వాసులకు జనసేన బరోసా

  • స్మశానానికి దారి లేక ఇబ్బందులు పడుతున్న మునగల దోరువు ప్రజలకు జనసేన బరోసా

సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, మునగల దోరువు అగ్రహారం నందు 500 కుటుంబాల వారు నివసిస్తున్నారు. వారికి ఏళ్ల తరబడి స్మశానానికి వెళ్లేటువంటి దారి లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా వారి సమస్యను తీర్చిన దాఖలాలయితే లేవు. ఎవరైనా ఆ 500 కుటుంబాలలో కాలం చెల్లితే పంట పొలాల్లో నుంచి తొక్కుకుంటూ బురదలో నలుగురు మనుషులు మోసుకొని వెళ్లాలంటే ఎంతో అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని అంటున్నారు.. ఇక్కడ చూస్తే కనీసం స్మశానాలకి దారి కూడా లేనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎన్నోసార్లు వారు ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటివరకు కూడా వారి సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్థులు మాతో చెప్పి వాపోయారు అదేవిధంగా ఆ స్మశాన స్థలం చుట్టూ చెట్లతో నిండిపోయి గుబురుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో ఆ గ్రామస్తులకి జనసేన పార్టీ నుంచి ఒకటే భరోసానిచ్చాం.. పంట పొలాల్లో పంట పూర్తయిన తర్వాత వారికి ఆ యొక్క స్మశానాన్ని సుభ్రం చేసి ఇస్తామని చెప్పి తెలియజేశాం. అదేవిధంగా ఈ సమస్యని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి మీ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు మేము అండగా ఉంటామని చెప్పి వాళ్లకి భరోసాని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు మండల అధ్యక్షులు సందీప్, రహమాన్, వీరబాబు, శ్రీహరి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.