మహాత్మాగాంధీ సేవలు మరువలేనివి

  • నివాళులర్పించిన జనసేన నాయకులు

రాజంపేట, జాతిపిత మహాత్మాగాంధీ సేవలు మరువలేనివని రాజంపేట జనసేన నాయకులు పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు ఆదివారం మహాత్మా గాంధీ 153 వ జయంతిని పురస్కరించుకొని రాజంపేట పట్టణంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ… స్వాతంత్ర సంగ్రామం నుండి నేటి వరకు మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాల సైతం గుర్తుంచుకునేలా గాంధీజీ చిరస్మరణీయుడయ్యారన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలకు రక్షణ కరువైందని వారిపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. మహిళలకు రక్షణ కల్పించని ఈ ప్రభుత్వం దిశా చట్టంపై విపరీతంగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ వైఫల్యంపై నిలదీసే వారిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తూ, అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గాంధీజీ చూపిన అహింసా మార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం ఉందన్నారు. పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్ముని మాటలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము అహింస హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కడప జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యాయుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన పార్టీ నాయకులు భాస్కర్ పంతులు, కోలాటం హరి, పోలిశెట్టి శ్రీనివాసులు, భువనగిరి పల్లి నాగరాజా, శంకరయ్య, వీరయ్య ఆచారి, గోపాల్, జనసేన వీర మహిళ జెడ్డా శిరీష, జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.