జనసేన ప్రచార వాహనాలు ప్రారంభించిన పంతం సందీప్

జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్ఐ కొట్టె బ్రదర్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాలు కొట్టె వెంకటరావు, కొట్టె సాయి, కొట్టె వెంకటేశ్వర్లు, కొట్టె అర్షద్, చిల్లా మహేష్ నిర్వహణలో సోమవారం కాకినాడ రూరల్ నియోజకవర్గం వలసపాకల గ్రామం గంగరాజు నగర్ రోడ్డు నెంబర్ 1 లో గల పార్టీ కార్యాలయం వద్ద కాకినాడ రూరల్ లోని గ్రామాల్లో, డివిజనలలో ప్రచారనిర్వహణకు 20 ప్రచార వాహనాలను జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన +టీడీపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.