గుండవరం పంచాయతీలో జనసేన అభ్యర్థి గుంటూరు శివకుమార్ గెలుపు

  • తీవ్ర ఉద్రిక్తల మధ్య హోరాహోరి పోటీలో గుండవరం గ్రామపంచాయతీలో మూడవ వార్డ్ కి జరిగిన బై ఎలక్షన్స్ లో 15 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన జనసేన పార్టీ అభ్యర్థి గుంటూరు శివకుమార్..

పొన్నూరు నియోజవర్గం: గుండవరం గ్రామపంచాయతీలో మూడో వార్డుకు జరిగిన బై ఎలక్షన్స్ లో జనసేన పార్టీ అభ్యర్థి గుంటూరు శివకుమార్ తన ప్రత్యర్థి అధికార పార్టీ అభ్యర్థిపై 15 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా గుమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్ రావు గుండవరం గ్రామంలో వారిని మరియు వారి గెలుపుకు కృషి చేసిన జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను గ్రామస్తులను అభినందించడం జరిగింది. గాదె మాట్లాడుతూ..
రాష్ట్రంలో రాబోయేది జనసేన ప్రభుత్వం అని చెప్పడానికి ఇవన్నీ సూచికలని తెలియజేయడం జరిగింది. అలాగే గెలిచిన అభ్యర్థులు జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం పనిచేయాలని సూచన చేయడం జరిగింది.