క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి ఆధ్యకు తిప్పన దుర్యోధన రెడ్డి ఆర్థిక భరోసా

కవిటి మండలలోని ప్రగడ పుట్టుగ గ్రామానికి చెందిన యాండ్రాపు చిరంజీవి అంజిలి దంపతుల ముద్దుల కుమార్తె 9 నెలల చిన్నారి ఆధ్య బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం జనసైనికులు ద్వారా తెలుసుకొన్న జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి పవన్ సేన సంస్థ ద్వారా ఆ చిన్నారి హాస్పిటల్ ఖర్చు నిమిత్తం తన వంతుగా 3000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఆ చిన్నారి ఆపరేషన్ కు 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వాలంటీర్ గా పని చేస్తున్న తండ్రి చిరంజీవి దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేయాలని కోరారు.