వనుదురు పంచాయితీలో ఊపందుకున్న జనసేన అభ్యర్థి కొనాల రేవతి ఉపఎన్నికల ప్రచారం

కైకలూరు నియోజకవర్గం: ముదినేపల్లి మండలం, వనుదురు గ్రామ పంచాయతీకి ఉపఎన్నికలు రావడంతో జనసైనికులలో మరింత ఉత్సాహం నింపింది. నియోజకవర్గం లోనే జనసేన పార్టీ చేసే సేవా కార్యక్రమాలలో ముందు వరుసలో ఉండే కొత్తపల్లి జనసైనికులు వనుదురు పంచాయితీలో ఉండడంతో గ్రామాల ప్రజలు ఈసారి జనసేన వైపు చూస్తారు అనే ఊహగనాలు ఎక్కువగా నడుస్తున్నాయి. దానికి తోడుగా కరోనా సమయంలో జనసైనికులు ప్రతి గడపకు కూరగాయలు పంపిణి, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకునివెళ్తూ పంచాయతీ ప్రజలకు మేము ఎల్లవేళలా తోడుగా ఉంటాము అని అనేక కార్యక్రమాలతో ప్రజల్లో ఉండడంతో, వనుదురు పంచాయితీలో రెండు క్రీయాశీలక కుటుంబాలకు 5లక్షలు చోప్పున అక్షరాలా 10లక్షల రూపాయిలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాలను ఆదుకోవడం, కొత్తపల్లిలో గత 3 సంవత్సరాలనుండి ఎక్కడా లేనివిధంగా ప్రజల దాహాన్ని తీర్చడంతో ప్రజల మన్ననలు పొందారు, ఎన్నిసార్లు వేడుకున్న ప్రయాణాలు చేసే ప్రజలు సరైన షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతుందడంతో జనసైనికులు మరియు గ్రామ యువత ముందుకు వచ్చి డొక్కా సీతమ్మ గారి విశ్రాంతి స్థలం ఏర్పాటు చేయడం ఇలా అనేక విధలుగా ప్రజలకు దగ్గరగా ఉంటూ ఈసారి ప్రత్యక్షంగా పంచాయతీ ఎన్నికల్లో నిలపడి అధికార వైసీపీ కి గట్టిపోటి ఇచ్చారు అనే దానిలో ఎలాంటి సందేహము లేదు. అభ్యర్థి కి పంచాయితీలో గట్టి పట్టు ఉండడం, అభ్యర్థి దగ్గరి బంధువు నాదెండ్ల మనోహర్ గారి కొత్తపల్లి పర్యటనలో అధికార వైసీపీని వీడి జనసేనలో చేరడం పార్టీ మరింత పుంజుకుంది. దానికి తోడుగా జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో బలంగా నిలబడి కష్టపడడంతో ఈసారి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పంచాయతిలో ఎప్పటినుండో ఉన్న సమస్యలను తాము రాగానే దృష్టిశారిస్తాం అని ప్రజలకు హామీ ఇస్తూ ఒక్క అవకాశం జనసేనకు ఇవ్వాలి అని జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి కొనాల రేవతి గారికి ఓటు వేసి అవినీతి లేని అభివృద్ధికి తోడ్పాడాలని కోరుకుంటూ కొనాల రేవతి గారి ఎన్నికల గుర్తు “మంచం”. మీ యొక్క అమూల్యమైన అతిముఖ్యమైన ఓటును మంచం గుర్తుపై వేసి అఖండ విజయాన్ని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలి అని గ్రామ ప్రజలను విన్నవించుకుంటున్నారు.