పాఠశాలల్లో మౌళిక సదుపాయలను వెంటనే పూర్తి చేయాలని జనసేన డిమాండ్

ఎల్.బి నగర్ నియోజకవర్గంలో గవర్నమెంట్ పాఠశాలల దుస్థితి దారుణంగా ఉన్నందున అనేక స్కూళ్ళను మేము పరిశీలించిన క్రమంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూసి, నేటి బాలలే రేపటి పౌరులు, ఈ సమాజంలో ఉన్నత స్థాయి చేరుకోవటానికి విద్య ఎంతో అవసరం, ప్రభుత్వ పాఠశాలల నందు కనీస వసతులు లేని దుస్థితి, తరగతి గదులు, టాయిలెట్స్, తాగునీరు వంటి ప్రాథమిక మౌళిక సదుపాయాలకు నోచుకోకుండా శిధిలావస్థలో ఉన్నాయి, కావున నియోజకవర్గంలో చెరువులు, పార్క్ లు స్మశాన వాటికలను సుందరీకరించటం కన్నా, ప్రధమంగా పాఠశాలలను బాగు చేయాలి, సామ్యూన్యుడికి అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ పాఠశాలలను గవర్నమెంట్ వారు పట్టించుకొని, రాబోయే రెండునెలల ఎండాకాల సమయాన్ని ఉపయోగించి ఫాస్టుట్రాక్ పద్దతిలో ఉత్తర్వులు జారీ చేసి మౌళిక సదుపాయలను వెంటనే పూర్తి చేయాలని జనసేన పార్టీ ఎల్.బి నగర్ కో ఆర్డినేటర్ సాయి శిరీష పొన్నూరు ఆధ్వర్యంలో శాంతియుత నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దీని మీద స్థానిక శాసనసభ్యులు వెంటనే స్పందించాలని కోరుతూ మరియు విద్యాశాఖ మంత్రి అయిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి వెంటనే తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.