ఘనంగా కొల్లా శంకర్ పుట్టినరోజు వేడుకలు

కేపిహెచ్బి కాలనీ, 3వ ఫేజు, రమ్య గ్రౌండ్ గణేష్ మండపంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ జన్మదిన వేడుకలు పార్టీలకతీతంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వచ్ఛంద సంస్థల నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పెద్దలు ఆశీర్వదించారు, పిల్లలు శుభాకాంక్షలు తెలియజేశారు. తరువాత ఆత్మీయ మిత్రులకు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొల్లా శంకర్ మాట్లాడుతూ ఇంతమంది ఆత్మీయల మద్య నేను ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి దయాకర్, తుమ్మల మోహన్ కుమార్, అంజి, నాగేంద్ర, వెంకటేశ్వరరావు, నాగరాజు, ముంతాజ్ వెంకటలక్ష్మి మహాలక్ష్మి, మహేష్, సుంకర సాయి మరియు తదితరులు పాల్గొన్నారు.