వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని జనసేన డిమాండ్..!

  • గొల్లప్రోలు ఎమ్మార్వోకు రైతులతో కలిసి వినతిపత్రం అందజేసిన మాకినీడి శేషుకుమారి

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రొలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని. పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి, మాజీ ఎంపీటీసీ జోత్యుల శ్రీనివాస్, మండల ప్రెసిడెంట్ అమరదివల్లి రామకృష్ణ, పలువురు రైతులు గొల్లప్రొలు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి గొల్లప్రోలు ఎమ్మార్వో ఆర్ వి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వారికి ఎల్లప్పుడు జనసేన పార్టీ ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మాజీ ఎంపీటీసీ జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులు పెట్టుబడిని నష్టపోయారని వారికి ప్రభుత్వం ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు, ఏదో కంటి తుడుపు చర్యల కాకుండా వారికి నష్ట పరిహారం అందించి సహాయం చేయాలని కోరారు. గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరదివల్లి రామకృష్ణ మాట్లాడుతూ పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడడంతో రైతులు ఎంతగానో నష్టపోయారని, వారి కోల్పోయిన పంటకు నష్టపరిహారం నుంచి వారికి సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, మాజీ ఎంపిటిసి జ్యోతుల శ్రీనివాస్, వార్డు నెంబర్ గొల్లపల్లి గంగ, మేడిబోయిన శ్రీనువాసు, జ్యోతుల నానాజీ, దేశిలింక బాస్కరరావు, జీలకర్ర కృష్ణ, పోలం త్రిమూర్తులు, మేడిబోయిన సత్యనారాయణ, అయినవిల్లి శ్రీను, జ్యోతుల గోపి, మేడిబోయిన బుచ్చిరాజు, రాసంశెట్టి ఈశ్వరుడు, జీలకర్ర కాపు, రాసంశెట్టి సూరిబాబు, ఆకుల వెంకటస్వామి, జ్యోతుల సీత రాంబాబు, ఆకుల వీరబాబు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు రైతులు తదితరులు పాల్గొన్నారు.