కందుకూరు జనసేన ఆధ్వర్యంలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

  • కందుకూరు కేసరగుంట కాలనీ వెళ్లు దారి పరిస్థితి అధ్వానం.
  • గుడ్లూరు నుండి రాజుపాలెం వెళ్లే రోడ్డు పరిస్థితి అధ్వానం.
  • గుడ్లూరు మండలం పాజర్ల గ్రామం పరిస్థితి అధ్వానం.
  • కరేడు నుంచి పెద్ద పట్టపాలెం రోడ్డు పరిస్థితి అధ్వానం.
  • చాగల్లు నుంచి చాకిచెర్ల వెళ్లే రోడ్డు పరిస్థితి అధ్వానం.

కందుకూరు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్ల పరిస్థితి విషయంలో గాఢ నిద్రలో ఉన్న సీఎం జగన్ రెడ్డికి తెలియజేసేలా చేయబడిన డిజిటల్ క్యాంపెయిన్ #GoodMorningCMSir ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా, కందుకూరు నియోజకవర్గం పలు గ్రామాల్లో మండలంలో రోడ్ల పరిస్థితి పరిశీలించిన కందుకూరు నియోజవర్గ ఇంచార్జ్ పులి మల్లికార్జున రావు రోడ్ల దుస్థితికి సంబంధించి ఫోటోలు చిత్రికించి #GoodMorningCMSir అనే హష్ టాగ్ ద్వారా సామాజిక మద్యమాల్లో ప్రచురించడం జరిగినది. జులై 15 నాటికల్లా ఒక్క గుంత కూడ ఉండదని చెప్పిన సీఎం జగన్ ఒక గుంత కూడా పూడ్చని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది, ఇకనైనా గాఢ నిద్ర నుండి లేచి రోడ్లపై దృష్టి పెట్టాలని జనసేన నాయకులు నిరసన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గం ఇంచార్జ్ పులి మల్లికార్జున రావు, కందుకూరు మండల అధ్యక్షులు మదన్ గోకరాజు, గుడ్లూరు మండల అధ్యక్షుడు రాజేష్ గుడ్లూరు మండల ఉపాధ్యక్షులు చలపతి ఉలవపాడు మండల ఫ్యాన్స్ అధ్యక్షులు బాలచందర్ నాయుడు, పంది వంశీ, కొనికి సిద్దయ్య, సాయి, నటరాజ్, యశ్వంత్, చందు, మహేంద్ర, కొట్టే రాజేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.