సీఎం సారూ.. ప్రమాదకర రోడ్లపై ప్రయాణమెలా..?: రాజంపేట జనసేన

*ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన జనసేన నాయకులు

రాజంపేట: రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుందని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రోడ్లు అధ్వానంగా తయారైన గోతులతో దర్శనమిస్తుంటే కనపడలేదని రాజంపేట జనసేన నాయకులు ప్రశ్నించారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు, రాష్ట్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, ఆదివారం గుడ్ మార్నింగ్ సీఎం డిజిటల్ క్యాంపెన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రహారం, కొత్త బోయినపల్లి తదితర ప్రాంతాల్లో దెబ్బ తిన్న రోడ్ల వద్ద ప్లేకార్డులు చేత బట్టి మారోడ్లు బాగు చేయండి సీఎం గారూ.. అంటూ వినాదాలు చేశారు. దారుణంగా దెబ్బతిన్న రోడ్ల మూలంగా స్థానికులు పడుతున్న ఇబ్బందులను ఆరాతీశారు. రోడ్లు అంతా గుంతల మయం కావడంతో ప్రజలు రోడ్డు ప్రయాణం చేయడానికి భయాందోళన చెందుతున్నారన్నారు. గర్భిణీ స్త్రీలు ఈరోడ్ల మార్గాన ప్రయాణం చేస్తే హాస్పిటల్ కు వెళ్లకముందే డెలివరీ అవుతారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రహదారులు మరమ్మతులుచేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్య క్రమంలో రాజంపేట జనసేన నేతలు పోలిశెట్టి శ్రీనివాసులు, కత్తి సుబ్బారాయుడు, బాస్కర్ పంతులు, తాళ్ళపాక శంకరయ్య, మనోహర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.