బాధితులకు న్యాయం జరిగేవరకు జనసేన పోరాటం

నగరి నియోజకవర్గం, పుత్తూరు మండలం, టి ఆర్ కండ్రిక ఎస్సీ కాలనీలోని వై ఇంద్రసేనయ్య (56) మృతి

8 నెలల క్రితం వై ఇంద్రసేనయ్య (56) వ్యక్తిని సారా సేవిస్తుండగా పుత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి రెండు లీటర్ల సారాని స్వాధీనం చేసుకున్నారు.

అతని అనారోగ్యంతో ఉండటంతో గ్రామ పెద్దల షూరిటీతో పుత్తూరు పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ చేశారు.

అనంతరం 8 నెలల తర్వాత వై ఇంద్రసేనయ్య ను అరెస్ట్ చేసి సబ్ జైలుకు పూర్తి ఆరోగ్యంతో తరలించడం జరిగింది.

మంగళవారం రాత్రి 7.00 గంటలకు వై ఇంద్రసేనయ్య (56) అనారోగ్యంతో బాధపడుతున్నారని తిరుపతి రుయా హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు.

వై ఇంద్రసేనయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలియజేయగా.. కుటుంబ సభ్యులు రుయా హాస్పిటల్ కి చేరుకున్నారు.

తండ్రి అనారోగ్యానికి గల కారణాలు తెలపాలని సంబంధిత పోలీస్ అధికారులను అడగగా.. పొంతన లేని సమాధానం చెప్పి వై పాల్గుణ పై భౌతిక దాడిచేసారు. దీన్ని జనసేన పార్టీ తరుపున తీవ్రంగా కండిస్తున్నాము.. వారికి న్యాయం జరిగేవరకు జనసేన అండగా ఉండి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని భరోసా ఇవ్వడం జరిగింది. దీనిపై తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది.