జంగాలపల్లి గ్రామంలో ఘనంగా జనసేన జెండావిష్కరణ

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం: యాదమరి మండలం, జంగాలపల్లి గ్రామంలో బాలాజీ, నేతాజీ, కిరణ్, విక్కీ, ఉమాపతి, లక్ష్మీపతి, తులసి, మాధవ మరియు జంగాలపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో జనసేన- తెలుగుదేశం నాయకులు సమక్షంలో బుధవారం జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, యాదమరి మండల అధ్యక్షులు కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మొరార్జీ యాదవ్, బంగారు బాల్యం మండల అధ్యక్షులు జయప్రకాష్ మరియు ముఖ్య నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచు, గ్రామ పెద్దలు, యువకులు, వీర మహిళలు ఉమ్మడి పార్టీల సిద్ధాంతాలకు ఆకర్షితులై, రాబోవు ఉమ్మడి ప్రభుత్వం ద్వారా తమ ఊరికి మేలు జరుగుతుందని భావిస్తూ, ఉమ్మడి ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మురళీమోహన్ గారు గ్రామస్తులు ఆదరణ చూసి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి వైపు నడిపిస్తానని వాగ్దానం చేశారు. ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించి, ఎన్నికలు సజావుగా ఎదుర్కోవలసిన సమయంలో ముఖ్యమంత్రి చేస్తున్న రెచ్చగొట్టి వాక్యాలు ప్రజాహితం కాదని, ఓడిపోతున్నామని భయంతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజలు వీటన్నిటినీ అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా ముక్తకంఠంతో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ పుష్ప, ఉపాధ్యక్షులు ఢిల్లీ, ప్రధాన కార్యదర్శులు వెంకటేష్ ప్రభాకర్, వేముల పవన్, బోయపాటి పవన్, కార్యదర్శులు చంద్ర, నిఖిల్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.